మాట్లాడుతున్న మాజీ మంత్రి నారాయణ
మాట్లాడుతున్న మాజీ మంత్రి నారాయణ
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి..!
మాజీమంత్రి నారాయణ
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్:నెల్లూరు నగరంలోని 10వ డివిజన్‌లో మాజీమంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు..ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. నేతలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని చెప్పిన ఆయన సిద్ధంగా ఉండాలని సూచించారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారన్నారు.టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు.










