ప్రజాశక్తి - భీమవరం
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని భద్రపర్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక రిలయన్స్ పెట్రోలు బంకు ఏదురుగా ఉన్న సిడబ్లూసి గోడౌన్లను జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టరు ప్రశాంతి పరిశీలించారు. గోడౌన్లో విద్యుత్ సౌకర్యం, పైకప్పు, షట్టర్ల భద్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సిడబ్ల్యూసి గోడౌన్ల విస్తీర్ణం, ఎన్ని గదులున్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇవిఎంలు, వివి ప్యాడ్స్, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపర్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్‌డిఒ దాసి రాజు, జిల్లా అగ్నిమాపక అధికారి బి.శ్రీనివాసరావు, తహశీల్దారు వై.రవికుమార్ పాల్గొన్నారు










