ఎన్‌ఆర్‌ఈజిఎస్‌లో వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యత
చిన్న తాతయ్య
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: మహాత్మా గాంధీ ఉపాధిహామీ పనులలో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టే పనులలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పనులు ఉండాలని, వ్యవసాయానికి పనికి వచ్చే పనులను సకాలంలో పూర్తిచేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని రాష్ట్ర ఉపాధి హామీ సంచాలకులు చిన్న తాతయ్య అన్నారు. చిత్తూరులో శనివారం సాయంత్రం డ్వామా కార్యాలయంలో చిత్తూరు డ్వామా పిడి చంద్రశేఖర్‌తో కలసి జిల్లాస్థాయిలో జరుగుతున్న వివిధ అభివద్ధి కార్యక్రమాలపై మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా విజిలెన్స్ విభాగం ద్వారా అమలు అవుతున్న సోషల్ ఆడిట్, రికవరీలు, విచారణలు, రెవెన్యూ రికవరీ యాక్ట్, కోర్టు విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఆడిట్ చేపట్టిన 16 విడుతల కార్యక్రమానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉపాధిహామీ పనులకు సంబంధించి కూలీలకు హాజరవుతున్న పరిస్థితి అదేవిధంగా యాప్ పనితీరు జరిగిన పనులకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 31మండలాల్లో యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సిన కార్యక్రమాలను వారం లోపల పూర్తి చేయాలన్నారు. అలాగే అకౌంట్స్ వ్యాలిడేషన్ కార్యక్రమాన్ని ఆధార్ సీడింగ్ కార్యక్రమాలు ఈనెల 30 లోపల పూర్తి చేయాలని ఆదేశించడంతో పాటు ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు రూ.250లు గిట్టుబాటు ధర తప్పనిసరిగా వచ్చేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగాభవాణి, ఉమావాణి ఇతర ఏపీడీలు, ఏపీవోలు పాల్గొన్నారు.










