Sep 07,2023 22:41

ఫర్టిలైజర్స్‌ దుకాణంలో తనిఖీలు చేస్తున్న వ్యవసాయ అధికారులు

     అనంతపురం : అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో గల ఎన్‌ఆర్‌ ఫర్టిలైజర్‌ దుకాణాన్ని వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.రవి, మండల వ్యవసాయ అధికారి జె.శశికళ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్‌ఆర్‌ ఫర్టిలైజర్‌ దుకాణంలో రైతులకు అమ్ముతున్న ఉత్పత్తుల స్టాక్‌ రిజిస్టర్లు, ఇన్‌ క్లూజిన్స్‌, స్టాక్‌ను పరిశీలించారు. వ్యవసాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా రూ.14.18 లక్షల విలువైన ఎరువులకు 'ఓ ''ఫారం లేనందున వాటి అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు ఏడీఏ రవి తెలిపారు. ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఎవరైనా అనుమతులు లేనివాటిని విక్రయిస్తుంటే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమములో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పంట నమోదు పరిశీలన
       అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని రాచానపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలోని పొలాల్లో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని అనంతపురం వ్యవసాయ ఏడీఏ ఎం.రవి గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంట సాగు వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. ఏడీఏ వెంట అనంతపురం రూరల్‌ మండల వ్యవసాయ అధికారి జె.శశికళ, వ్యవసాయ విస్తరణ అధికారులు మురళి, ప్రసాద్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ఉన్నారు.