ప్రజాశక్తి -అనంతపురం అనంతపురం రూరల్ పరిధిలోని ఎ.నారాయణపురం పంచాయతీ తపోవనం నందు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల కలిగిన లబ్ధిని ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే వివరించారు. ప్రత్యేక బుక్‌లెట్‌లను పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేరుగా పథకాలను ప్రతి గడపకూ అందిస్తున్నామని తెలియజేశారు. డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణాలకు సంబంధించి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కార చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి చంద్ర, ఎంపీపీ, జేసీఎస్ కన్వీనర్ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, ఎంపీటీసీ నాగేంద్ర, కార్పొరేటర్ శ్రీనివాసులు, వైసీపీ నేతలు జగన్‌మోహన్‌రెడ్డి, మల్లెల వేణుగోపాల్, బి.మదన్‌మోహన్‌రెడ్డి, హాజీవలి, కృష్ణారెడ్డి, బషీర్,పుల్లారెడ్డి, జాఫర్, రామానుజన్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రమణారెడ్డి, రాధాకృష్ణ, రత్నమయ్య, అనిల్ గౌడ్, భారతి తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం : అభివృద్ధి సంక్షేమమే సీఎం జగనన్న లక్ష్యం అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. మండల కేంద్రంలోని సచివాలయం -3 పరిధిలోని కెవిఎస్ నగర్, వీరభద్ర కాలనీ, ఐలమ్మ కాలనీ, గిరి ప్రసాద్ నగర్, దక్షిణామూర్తి నగర్‌లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దారు మోహన్ కుమార్, ఎంపీడీవో తేజోత్న్స, ఎంపీపీ సునీత, జడ్పీటీసీ భాస్కర్, సర్పంచి పార్వతి, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు పూల నారాయణస్వామి, మానేరు కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.










