ప్రజాశక్తి-పాలకొల్లు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా పాలకొల్లు తహసిల్దార్ ఆఫీస్ వద్ద శనివారం ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేశారు. జిల్లా అధ్యక్షులు టిఆర్ఎస్ రాజు తాలూకా అధ్యక్షులు సునీల్ కుమార్ సారధ్యంలో దీక్షలు జరిగాయి. సిపిఎస్ రద్దు పరచి ఓపిఎస్ అమలు చేయాలని 1993 నవంబర్ 25 కన్నా ముందు నియమితులైన ఎన్.ఎం.ఆర్ కంఠింజెంట్ ఉద్యోగులు నియామకం పొందిన కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. బకాయి డిఏలు విడుదల చేయాలని, పిఆర్సి కమిషన్ నియమించాలని, అకౌంట్లో దాచుకున్న సొమ్ముకు భద్రత కల్పించాలని మున్నగు 10 డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగుల డిమాండ్ చేశారు. దీక్షలో P. కృష్ణ కిషోర్, మండెల నర్సింహారావు, AVS సుబ్రహ్మణ్యం, M.V రమేష్,V. భరద్వాజ్,B. జోగారావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప.గో.జిల్లా అధ్యక్షులు GRSN రాజు, జిల్లా కార్యదర్శి P.S.చంద్రమౌళి, పాలకొల్లు తాలూకా యూనిట్ తరపున వివిబి. సునీల్ కుమార్, అధ్యక్షులు,టి వి రామమూర్తి ,అసోసియేట్ అధ్యక్షులు. పి కృష్ణ కిషోర్, కార్యదర్శి ఎమ్ రమేష్, కోశాధికారి ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ Ch. శ్రీనివాస్,జానకిరామ్, V.భరద్వాజ్,లలిత కుమారి మరియు vro లు,CITU నాయకులు జవ్వాది శ్రీనివాస్ తమ సంఘంతో వచ్చి మద్దతు తెలిపారు.










