May 06,2022 12:47

వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలంలో శుక్రవారం మండలం కేంద్రంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణస్వామి హాజరయ్యారు. ఎంపీడీవో సుధాకర్‌రావు స్టేజిపై చేతులు కట్టుకొని ఓ మూలన నిలబడటంపై స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ మండల అభివఅద్ధి అధికారికి ఇచ్చిన మర్యాద ఇదేనా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ అధికారం లేని ఎంపీపీ నాగరాణి భర్త హేమ సుందర్‌ రెడ్డి ని స్టేజీపై కూర్చోపెట్టారనీ.. ఇది ఎంత వరకు న్యాయం ? అని పలువురు గుసగుసలాడారు.