Sep 08,2023 21:47

ఎంపీ గోరంట్ల మాధవ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెలుగుయువత నాయకులు

            ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హిందూపురం ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో శుక్రవారం టవర్‌క్లాక్‌ సర్కిల్‌లో ఎంపీ గోరంట్ల మాధవ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు సుధాకర్‌యాదవ్‌ మాట్లాడుతూ సిఎం జగన్‌ను మాజీ సిఎం చంద్రబాబు అనరాని మాట అన్నారంటూ నీతిమాలిన వాఖ్యలు చేయడం ఎంపీ మాధవ్‌ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. నోరు అదపులో పెట్టుకోవాలని, చంద్రబాబుని విమర్శించే స్థాయి నీది కాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గల్లంతవుతావనే భయపడి ఇలాంటి వాఖ్యలు చేస్తున్నట్లు ఉందనిన్నారు. మరోమారు నోరు పారేసుకుంటే నీఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గోపాల్‌గౌడ్‌, బొమ్మినేని శివ, బాలప్ప, వడ్డే మురళి, శిరీషాల రాంబాబు, అంజి, సుంకన్న, సున్నం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.