అన్నదానం చేస్తున్న దృశ్యం
ఎంఎస్‌ఆర్ స్పాస్టిక్ సెంటర్‌లో అన్నదానం
ప్రజాశక్తి-నెల్లూరు :ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్‌ఆర్ స్పాస్టిక్ సెంటర్‌లో దాసరి అనంత పద్మనాభం ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని బుధవారం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కీర్తిశేషులు దాసరి అనంత పద్మనాభం కుటుంబ సభ్యులు దాసరి హైమావతి, ప్రముఖ న్యాయవాది దాసరి రాజేంద్రప్రసాద్, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి దుర్గాప్రసాద్, దాసరి కిరణ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని ఐ.ఆర్.సి.ఎస్. ఎం.ఎస్.ఆర్. స్పాస్టిక్స్ సెంటర్ కు సెలవలు ప్రకటించినందున 18.10.2023 న ముందస్తు దసరా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో దాసరి రాజేంద్ర ప్రసాద్ దసరా ప్రసస్తాన్ని స్పాస్టిక్స్ సెంటర్ మానసిక దివ్యాంగులైన పిల్లలకు వారి తల్లిదండ్రులకు రెడ్ క్రాస్ సిబ్బంది తెలియజేస్తూ, వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో ప్రిన్సిపల్ గురునాద రావు, వైస్ ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరి, ఫిజియోథెరపిస్ట్ లు వాసు, నవీన్, అక్తర్ ఇతర ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.










