ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు పట్టణంలో రోహిణి కార్తె ప్రభావం శనివారం తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోడ్లపై జనసాంద్రత తక్కువగా ఉంది. శనివారం అయినా జనసంచారం తక్కువగా ఉండటంతో వ్యాపారులు వ్యాపారం లేక గగ్గోలు పెడుతున్నారు. వారపు సంత సైతం మధ్యాహ్నం కొనుగోలు దారులు లేక నిర్మానుష్యంగా ఉంది. ప్రధాన రోడ్లు మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారాయి.










