Nov 03,2022 21:47

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పెరుగుతోంది
జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌
ప్రజాశక్తి- చిత్తూర్‌ అర్బన్‌

జిల్లాలో ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటు నమోదు ప్రక్రియను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. గురువారం సాయంత్రం అమరావతి నుండి ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఉపాధ్యాయ, గ్రాడ్యూయేట్‌ ఎంఎల్‌సి ఓటర్ల నమోదు, ప్రత్యేక ఓటర్ల సవరణ- 2023 సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, ట్రైనీ కలెక్టర్‌ వై. మేఘస్వరూప్‌ పాల్గొన్నారు. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరులకు సంబంధించి గతంలో జరిగిన ఎన్నికల్లో 2,017లో 8,777మంది ఉపాధ్యాయులు, 73,685 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ప్రస్తుతం ప్రకాశం- నెల్లూరు- చిత్తూరులకు సంబంధించి 2 లక్షల 5 వేల పట్ట భద్రులు దరఖాస్తు చేసుకోగా, చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు 28,122 దరఖాస్తులు అందాయన్నారు. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మూడు జిల్లాల పరిధిలో 8,400 దరఖాస్తులు అందగా, అందులో చిత్తూరు జిల్లా ఏడు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు 1,024 దరఖాస్తులు అందాయని తెలిపారు. జిల్లాలో ఓటర్ల ఆధార్‌ అనుసంధానం 65శాతం ఉందని జెసి వివరించారు. 165- పుంగనూరు నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫారం18 ద్వారా 5,730 దరఖాస్తులు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఫారం19 ద్వారా 118 దరఖాస్తులు, 170- నగరి నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫారం 18 ద్వారా 2891 దరఖాస్తులు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఫారం 19 ద్వారా 115 దరఖాస్తులు, 171- జీడీనెల్లూరు నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫారం18 ద్వారా 4,340 దరఖాస్తులు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఫారం 19 ద్వారా 68 దరఖాస్తులు, 172 -చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫారం 18 ద్వారా 4,321 దరఖాస్తులు ఉపాధ్యాయ నియోజకవర్గానికి 323 దరఖాస్తులు, 173-పూతలపట్టు (ఎస్‌సి) నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గానికి 3,726 దరఖాస్తులు ఉపాధ్యాయ నియోజకవర్గానికి 126 దరఖాస్తులు, 174- పలమనేరు నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గానికి 3943 దరఖాస్తులు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి -153 దరఖాస్తులు, 175- కుప్పం నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గానికి- 3,171 దరఖాస్తులు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 121 దరఖాస్తులు అందాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్‌తోపాటు పుంగనూరు, పూతలపట్టు, జీడి నెల్లూరు, ఈఆర్‌ఓలు ప్రభాకర్‌రెడ్డి, పర్వీన్‌, భవాని, ఎలక్షన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పద్మజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.