ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమీక్ష
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌కు 4,17,244 మంది ఓటర్లు
పోలింగ్ కేంద్రాలు 304
టీచర్స్‌కు 2,64,03 మంది ఓటర్లు
177 పోలింగ్ కేంద్రాలు : డిఆర్‌ఓ రాజశేఖర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం డిఆర్‌ఓ సమావేశం హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో స్పెషల్ సమరీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాను ఈనెల 19న జాబితా విడుదల చేయడం జరుగుతుందని, ఓటరుగా నమోదు చేసుకొని ఉండి, ఓటరు జాబితాలో పేర్లు లేకుంటే రెండో విడతగా ఈ నెల 23 నుండి డిసెంబరు 9వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఆన్‌లైన్లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించుటకు సంబంధిత విఆర్‌ఓలు ఇంటి వద్దకు వస్తారని, వారికి మీ ఒరిజినల్ సర్టిఫికెట్లును చూపించాలన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్‌కు 4,17,244 మంది ఓటర్లు, టీచర్స్ సంబంధించి 2,64,03మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. గ్రాడ్యుయేట్ సంబంధించి 304 పోలింగ్ కేంద్రాలు, టీచర్స్ సంబంధించి 177 పోలింగ్ కేంద్రాలు, మండల కేంద్రాలలోనే గ్రాడ్యుయేట్‌కు, టీచర్స్‌కు వేరువేరుగా పోలింగ్ కేంద్రాల వుంటాయని తెలిపారు. ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లు నమోదుకు అన్ని రాజకీయపార్టీల నాయకులు సహకరించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి తహశీల్దార్ పద్మజ, డిటి ప్రార్థసారది, వైఎస్సార్సీపీ నుండి మురిగేష్, టిడిపి నుండి సురేంద్ర కుమార్, సీపీఎం నుండి వాడ గంగరాజు, బిజెపి నుండి చిట్టిబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.










