- ఇదేమి కర్మ కార్యక్రమంలో మోహన్ మురళి
ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : మండలంలోని గురువారం గొడుగుచింత పంచాయతీలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. స్థానిక మాజీ ఎంపీటీసీ టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి పి.మోహన్ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. అయన మాట్లాడుతూ టిడిపి జనసేన పొత్తు ఉంటుందని సమాచారంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. రాష్ట్రంలో టిడిపితో కలిసి నడిచేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సంతోషిస్తూ స్వాగతిస్తున్నాం. ఈ పొత్తును జగన్ రెడ్డి,వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి శ్రీరాములురెడ్డి, బూత్ కమిటీ కన్వీనర్ దామోదర్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు నాయకులు పి.జయచంద్రరెడ్డి, వెంకటేష్ నాయుడు, దాము, వర్మ,పి.జయచంద్రారెడ్డి, పాపయ నాయుడు, మురళి నాయుడు, రఘునాథరెడ్డి,కేసుల నాయుడు, శ్రీనివాసులు, చంగల్రరాయలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










