ప్రజాశక్తి-పలమనేరు : పలమనేరు రూరల్ మండలంలోని పెంగరగుంట, వడ్డూరు, మొసలిమడుగు. గ్రామాలలో శుక్రవారం. శనివారం రాత్రి గుంపుఏనుగులు పంటపొలాపై ప్రవేశించి కోతదశలో ఉన్న వరిపంటలు. టమేటా. పశుగ్రాసం తదితర పంటలను గత వారం రోజులుగా సమీప గ్రామాల్లో సాయంత్రం 7 గంటలకే పంటపొలాల్లోనికి ప్రవేశించి పలురకాల పంటలను ద్వంసంచేసి పూర్తిగా నష్టపరుస్తూనేవున్నాయి వీటిని తరిమెందుకు ప్రయత్నిస్తున్న రైతులను అటవిశాఖ ట్రాకర్స్ లను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రైతులు పంటలను కాపాడుకునేందుకు రాత్రంతా పొలాలవద్ద చలిలో నిద్రలేనిరాత్రులు గుడుపుతూ ఈ గుంపుఏనుగులు ఎటువైపు వచ్చి ఎవరిపై దాడీ చేస్తాయో అని పొలాలవద్ద భయబ్రాంతులకు గురౌతున్నారు. అటవిసమీప సమీపగ్రామాల్లో రైతులు గత నెలలతరబడి పొలాలవద్ద పడిగాపులు కాస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నా కూడా ఏదోఒక చోట గుంపులవారిగా వచ్చి విడివిడిగా పంటపొలాల్లోనికి ప్రవేశించి కోతదశలో ఉన్న వరిపంటలతోపాటు ఇతర పంటలను తొక్కి ద్వంసంచేసి నష్టపరుస్తూనేవున్నాయి రైతులు కుటుంబ జీవనాదారం కోసం పంటపెట్టుబడులకు లక్షలాది రూపాయలు అష్టకష్టాలు పడి అప్పులుచేసి వేసిన పంటలు కోతదశలోపు ప్రతినిత్యం అనేకసార్లు గుంపులవారిగా వచ్చి వేసినపంటలన్నీ చేతికందకనే పూర్తిగా నష్టపరుస్తూనేవున్నాయి. అటవిశాఖ ట్రాకర్స్ కూడా వచ్చి రాత్రంతా వారి శక్తియుక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారిపై కూడా తిరగబడి భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ గుంపు ఏనుగులు ఈ మద్య టేకుమంద, కీరమంద.మొగిలి, మొగిలేరుపల్లి, గాండ్లపల్లి తదితర ప్రాంతాల్లో తిరుగుతూ పంటలను ద్వంస్సం చేపడుతున్నందున ఆ ప్రాంతాల్లోని రైతులు అటవిశాఖ వారితో గొడవకు దిగడంతో వాటిని పశ్చిమ ప్రాంతాల్లోనికి మళ్ళించారు అవి గత రెండు రోజులుగా గుంపులుగా సంచరిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి ఇప్పటికైనా సంబందిత అదికారులు మరియు ప్రజాప్రతినిధులు వీటిపై చొరవచూపి పంటపొలాలపై రాకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు










