Dec 15,2022 11:22

ప్రజాశక్తి-సోమల: సోమల మండలం నంజంపేట పంచాయతీ ఊసల గడ్డ యానాదివాడ గ్రామంలో ఏనుగు భీభత్సం సృష్టించింది. 3 పూరి గుడిసెలను పూర్తిగా ధ్వంసం చేయగా..  ఒక పూరి గుడిసె పాక్షికంగా ధ్వంసం అయింది. నిత్యవసర సరుకులు చిందర, వందర చేసిన ఆ ఏనుగు కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేసింది.