Nov 30,2022 22:23

నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు


ఏలుమలై మతి కేసులో ఇద్దరి అరెస్టు
ప్రజాశక్తి -రామకుప్పం
:హొమండల పరిధిలోని పంద్యాలమడుగు పంచాయతీ, ఎస్‌.గొల్లపల్లి గ్రామంలో 89 పెద్దూరు గ్రామానికి చెందిన సెల్వమ్‌ కొడుకు ఏలుమలై అలియాస్‌ ముత్తు నాలుగు రోజుల క్రితం అనుమాస్పదంగా మతి చెందిన కేసులో బుధవారం ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు రామకుప్పం ఎస్‌ఐ సి. ఉమామహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. కాగా మతుడు తెలుగుదేశంం పార్టీకి చెందిన వార్డు సభ్యుడు కావడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పలమనేరు డిఎస్‌పి సుధాకర్‌ రెడ్డి ఇటీవలి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి ఈ కేసు పై దర్యాప్తును వేగవంతం చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏలుమలై మరణానికి గల కారణాలను వెలికి తీయడం జరిగిందని బుధవారం ఎస్‌ఐ తెలిపారు. దర్యాప్తులో ముద్దాయి శివగామితో మతుడు ఏలుమలై ఏ.ముత్తు వివాహేతర సంబంధం ఏర్పరచుకొని, ఆమె ప్రోద్బలంతోనే మతుడు ఏలుమలై శివగామి ఇంటిలోని ఫ్యాన్‌కు ఊరి వేసుకొని చనిపోవడంతో ఆటోలో చికిత్స కోసం ఆర్‌.ఎం.పి డాక్టర్‌ వద్దకు పోయే లోపే ఏలుమలై చనిపోవడంతో, డెడ్‌ బాడిని పల్లికుప్పం గ్రామానికి చెందిన కాంతరాజ్‌ ద్వారా ననియాల ఏనుగుల షెడ్‌ వెనుక అటవీ ప్రాంతంలో పడవేశారన్నారు. ఈ కేసులోని ముద్దాయిలు శివగామి, కాంతరాజ్‌లను బుధవారం చెలిమిచెను తాండా బస్‌ షెల్టర్‌ వద్ద అరెస్టు చేసి, నేరానికి ఉపయోగించిన లగేజ్‌ ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.