ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులను కలెక్టర్ ఎం. హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ ఎస్ .వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనులు నిర్వహిస్తున్న వారితో మాట్లాడుతూ ఎక్స్‌ప్రెస్ హైవే ఏ విధంగా వస్తుందని, నిర్మాణాలు ఏ విధంగా చేస్తున్నారని అడిగారు అనంతరం చిత్తూరుకు సంబంధించిన సర్వీస్ రోడ్డు సర్కిల్ ప్రాంతం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ భూ సమస్యలు దాదాపుగా పూర్తయ్యాయని, ఇక పనులు వేగవంతం చేసుకోవచ్చునని అన్నారు. అదేవిధంగా చెరువులకు సంబంధించిన స్ట్రక్చర్స్ లో మార్పులు లేకుండా చూడాలని అన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు భూమికి సంబంధించి ఉంటే జాయింట్ కలెక్టర్ తో సంప్రదించవచ్చునని తెలిపారు. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వల్ల చిత్తూరుకి బెంగళూరు నుంచి లేదా చెన్నై నుంచి వచ్చే సమయం భారీగా తగ్గిపోతుందని, నాలుగు ఓవర్పాస్ రోడ్లు, రెండు ఇంటర్ చేంజ్ రోడ్లు వారు కలెక్టర్కు వివరించారు. అదేవిధంగా ఈ ఏడాది మే నెలలో పనులు ప్రారంభించామని, షెడ్యూల్ ప్రకారం 2024 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ విద్యుత్ లైన్లు మార్చే సమయంలో ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని సిద్ధం చేసుకుని లైన్ల మార్పు తీసుకోవాలని రైతులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ప్రెస్ హైవే కి సంబంధించి సావిత్రి దేవి, ఆర్డీవో రేణుక, తాసిల్దార్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
'స్వామిత్ర' సర్వే పారద్శకంగా చేపట్టాలి
గహ నిర్మాణదారులకు సంబంధించిన భూ హక్కులను కల్పించేందుకు స్వామిత్వ సర్వే నిర్వహించబడుతుందని, దీనికి అందరూ సహకరించాలని, సిబ్బంది నిష్పక్షపాతంగా ఈ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్ .వెంకటేశ్వర్ తో కలసి గుడిపాల మండలంలోని పాపసముద్రంలో స్వామిత్వ రీ సర్వే కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ ఆర్ ఐ షీట్లు వచ్చిన తర్వాత సర్వే కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? అందుకు తగిన విధానం ఎటువంటిది? అని సిబ్బందిని అడిగారు. ఈ కార్యక్రమంలో ఏడి సర్వే కనక ప్రసాద్, ఆర్డిఓ రేణుక, డిపిఓ లక్ష్మి, తాసిల్దారు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
గృహనిర్మాణాలను వేగవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వం గహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వేగవంతంగా గహ నిర్మాణాలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. చిత్తూరు నగరపాలక పరిధిలోని అనుప్పల్లి గహ నిర్మాణాల సముదాయమును జిల్లా కలెక్టర్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, నగరపాలిక కమిషనర్ అంజలితో మాట్లాడుతూ గహ నిర్మాణాలు వేగవంతంగా చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు.










