ప్రజాశక్తి-శ్రీకాళహస్తి:
స్థానిక ఏరియా ఆసుపత్రిని శ్రీకాళహస్తీశ్వరాలయానికి అను బంధం చేసి అభివృద్ధి చేపడతామని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. శనివారం ఏరియా ఆసుపత్రికి ప్రగతి ట్రస్టు, సన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో వైద్య పరికరాలు అందజేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడారు. కోవిడ్ కాలంలో వైద్యులు ప్రాణాలను ఫణంగా పెట్టారంటూ అభినందించారు. సత్కరించారు. రోగులు, ఆసుపత్రి అవసరాల రీత్యా ప్రగతి ట్రస్టు, సన్ నెట్వర్క్‌లు వైద్య పరికరాలు అందజేయడం అభినందనీయయన్నారు. పేద రోఎగులకు విశిష్ట సేవలందిస్తున్న ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు ముక్కంటి ఆలయంతో అనుసంధానం చేయడానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. పాలక మండలి ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు, సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










