ప్రజాశక్తి-ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కృషితో పట్టణ శివారులోని లత్తవరం రోడ్డులో సైడ్ వాల్, డ్రైనేజి పనులకు శాశ్వత పరిష్కారం అయిందని మండల ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు అన్నారు. స్థానిక భగవాన్ రిక్రియేషన్ క్లబ్ సమీపం నుంచి సమ్మన కుంట వరకు జరుగుతున్న డ్రైనేజి, సైడ్ వాల్ నిర్మాణపు పనులను సర్పంచ్ లలిత,ఎంపీపీ చంద్రమ్మ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.పనులను నాణ్యతతో వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాది ఉరవకొండ నుంచి షేక్షానుపల్లి వరకు రూ.4.28 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులకు ఎంపీ రంగయ్య,మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందేనన్నారు.ఆ పనుల్లో భాగంగానే సమ్మన కుంట వరకు వెళ్లే డ్రైనేజిని, అదే విదంగా సైడ్ వాల్ ను కూడా నిర్మాణం చేస్తున్నారని చెప్పారు.ఈ పనులు పూర్తి అయితే ఈ ప్రాంతంలో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కురుబ రాష్ట్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోవిందు,పిఎసిఎస్ చైర్మన్ షేక్షావలి,డైరెక్టర్ ప్రసాద్ మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రి స్వామి,పార్టీ పంచాయతీరాజ్ అధ్యక్షులు బసవరాజు,నాయకులు ఓబన్న,వేమన్న,ప్రకాష్,వడ్ల సలీం,చిన్న భీమా,పచ్చి రవి తదితరులు పాల్గొన్నారు.










