ప్రజాశక్తి-రొంపిచెర్ల : రొంపిచెర్ల ఎస్సై శ్రీనివాస్ శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రొంపిచెర్ల మండలంలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయరాదన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో గ్రామపంచాయతీ అనుమతి లేనిదే బ్యానర్లు, కటౌట్లను ఏర్పాటు చేయరాదని తెలియజేశారు. ఒక వేళ రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయాల్సి వస్తే గ్రామపంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడ బ్యానర్లు, కటౌట్లు కట్టకూడదని తెలిపారు. గ్రామాల్లో మైకులతో ప్రచారం చేయాల్సి వస్తే పోలీసు వారి అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తెలిపారు. అధికారుల అనుమతి తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బస్టాండ్ ప్రాంతాల్లో, వీధులలో ఎక్కడ బడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రోడ్ల మీద వాహనాలు నిలిపి ఉంచితే వాటికి జరిమానా తప్పదని సూచించారు. ప్రజల శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ శ్రీనివాస్ కోరారు.










