ప్రజాశక్తి-ఆత్మకూరు : రాప్తాడు మండలం కేంద్రంలో శ్రీ పండమేటి రాయుడు దేవాలయం నూతన ఆలయం నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దేవాదాయ శాఖ వారితో కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు శ్రీ పండమేటి రాయుడు నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










