ప్రజాశక్తి-గణపవరం : ప్రభుత్వం డ్వాక్రా యానిమేటర్లను దశలవారీగా తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని సిఐటియు గణపవరం మండల కమిటీ కార్యదర్శి పి గోవిందు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో డ్వాక్రా యాని మేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక వెలుగు కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. డోక్రా యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు తొలగించిన వి ఓ ఏ లకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. యానమేట్లను ప్రభుత్వం తొలగించే ప్రయత్నం మానుకోకపోతే సిఐటియు ఆధ్వర్యంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం గణపవరం ఎంపీడీవో జి జ్యోతిర్మయికి ఏపిఎం సిహెచ్ రాజేష్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అడ్డగర్ల సుబ్బలక్ష్మి ప్రసన్న లక్ష్మి రత్న మాణిక్యం పాల్గొన్నారు.










