ప్రజాశక్తి-వెదురుకుప్పం : వెదురుకుప్పం మంలంలో వీధి కుక్కల దాడిలో సన్న మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లిలో ఆదివారం ఉమాకర్ రెడ్డికి చెందిన ఓ గొర్రె పిల్లను వీధి కుక్కలు దాడి చేసి చంపేసాయి. వీధి కుక్కలు గుంపుగా కనిపిస్తే గ్రామస్తులు హడలిపోతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదల నుంచి గ్రామస్తులను కాపాడాలని కోరుతున్నారు.










