- ఏలూరుపాడు గ్రామస్తుల వినతి
ప్రజాశక్తి-కాళ్ల : ఏలూరుపాడు గ్రామంలో ఆక్వా సాగుతో తాగునీటి వనరులను కలుషితం చేయవద్దని,ఆక్వా చెరువులు త్రవ్వకాల వద్దంటూ పంచాయితీ తీర్మానం చేయాలని గ్రామస్తులు శనివారం గ్రామ సర్పంచ్ భూపతిరాజు వెంకట జగ్గరాజు కువిన్నవించారు.ఏలూరుపాడు గ్రామంలో గాంధీ బజార్ వీధిలో రక్షిత మంచినీటి చెరువు సమీపంలో వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చుటకు ప్రయత్నాలు చేస్తుండగా గ్రామస్తులు ఇటీవల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ నెంబర్228నుంచి 247 వరకు ఉన్న వ్యవసాయ భూములను చేపల చెరువు లుగా మార్పు చేస్తే వాటికి సమీపంగా రక్షిత మంచి నీటి చెరువు నీటి కాలుష్యం వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా చెరువులు వల్లపర్యావరణానికి ముప్పు పొంచిఉందని, భూగర్భ జలాలు పూర్తిగా దెబ్బతినే అవకాశాలుఉన్నాయని,త్రాగునీటి వనరులు పూర్తిగా నాశనంఅవుతాయని, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ఆక్వా చెరువులు తవ్వకూడదని పంచాయతీ తీర్మానంచేయాలంటేగ్రామస్తులు డిమాండ్ చేశారు. ఏలూరుపాడు గ్రామంలో8వేల మంది జనాభా కలరు.గ్రామంలో త్రాగునీరు ప్రధాన సమస్యగా ఉంది. నాగుల మంచినీటి చెరువే ప్రధాన ఆధారం. మంచినీటి చెరువుకి ఎగువ భాగంలో ఆక్వా చెరువుల తవ్వకం చేపట్టకూడదని గ్రామస్తులు ఇటీవల జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లారు.అధికారులు ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఇరిగేషన్,రెవిన్యూ అధికారులు చెరువు త్రవ్వకాల విషయంపై స్పందించడం లేదు అధికారుల అలసత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంచినీటి చెరువు గట్టు బలహీనంగా ఉంది గట్టు పట్టిష్టపరచి శాశ్వత పరిష్కారంగా అవుట్లెట్, ఇన్ లెట్ నిర్మాణ పనులు చేపట్టాలని, ఆక్వా చెరువులు తవ్వకుండా పంచాయతీ తీర్మానం చేయాలని, ప్రజలకు స్వచ్ఛమైన అందించాలని సర్పంచ్ భూపతిరాజు వెంకట జగ్గరాజును గ్రామస్తులు కోరారు. మంచినీటి చెరువు లో నీరు పుష్కలంగా నింపడంతో ఆ నీరు చేపల చెరువుల తవ్వే ప్రదేశంలో ఊటగా వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రతి కుటుంబానికి రక్షితమంచి నీటిని అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంచేసి చర్యలు తీలుకున్నామని సర్పంచ్ భూపతిరాజు వెంకట జగ్గరాజు తెలిపారు.ఈకార్యక్రమంలోఎంపిటిసి చిన్నపరపు రాంబాబు, నల్ల గచ్చు నాగార్జున, నిమ్మకాయల సాయి, మాదేటి రాఘవులు, కొట్టుప్రభాకర్, యదాలవెంకటేశ్వరరావు, కొండపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.










