Jul 01,2023 14:24

ప్రజాశక్తి-గణపవరం : మండలంలో పిఎంపి అసోసియేన్ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్స్ డే సందర్భంగా గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు అయినా పి సంతోష్ నాయుడు కే కిరణ్మయి, కే ప్రియాంక దివ్యలకు ఘనంగా సన్మానం నిర్వహించారు. వారికి పుష్ప గుచ్చాలు అందించి దుస్సాలు కప్పి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.ఎం.పి అసోసియేషన్ కన్వీనర్ ఎం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కే పరమేశ్వరరావు, కో కన్వీనర్ వి శివ శ్రీనివాసు, కొటకల అప్పారావు, పానకాలు జి శ్రీను, సత్యనారాయణ, ఎం శ్రీను పాల్గొన్నారు.