Jul 01,2023 16:05

ప్రజాశక్తి-పాలకొల్లు : డాక్టర్స్ డే సందర్భంగా శనివారం పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. G. ప్రభాకర్,హాస్పిటల్ కమిటీ సభ్యులు డా చినిమిల్లి గణపతి, చెన్ను విజయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ్ కుమారిల ఆధ్వర్యంలో డాక్టర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది.హాస్పిటల్ లో వివిధ విభాగాల్లో ఉన్న డాక్టర్స్ ను ఘనంగా సన్మానించారు. ముందుగా డా బి సి రాయ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.గీతా కుమారి, సునీత, పియుష, నళిని, జయధుర్గా, రేణుకా మాధురి, సౌజన్య, ప్రశాంతి, భవానీ, రాంబాబు, కళ్యాణ చక్రవర్తి, భాస్కర్, సుదీర్, రిచర్డ్, మొదలగు డాక్టర్స్, హేడ్ సిస్టర్స్ పాతిబా, సుజాత, మొదలగు వారు పాల్గోన్నారు.