Feb 03,2023 14:42

ప్రజాశక్తి -  ఎస్ఆర్ పురం  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవ్వ తాతలకు పెన్షన్ ను వాలంటరీ తన బాధ్యతగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెన్షనర్ కి పెన్షన్ అందించారు. వివరాలు ఇలా.... శుక్రవారము మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ కొత్తపల్లి మిట్ట గ్రామ సచివాలయానికి చెందిన మీనాక్షమ్మ అనారోగ్యంతో ఆపరేషన్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి గ్రామ సచివాలయ వాలంటరీ దీనావతి ప్రతినెల 1వ తారీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పెన్షన్ ను  తన సొంత ఖర్చులతో తిరుపతికి వెళ్లి ఆడవాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మీనాక్షమ్మకు పెన్షన్ డబ్బులను అందించారు.  వాలంటరీ దీనావతి తమ బాధ్యతగా   పెన్షన్ ను తిరుపతికి వచ్చి అందించడం సంతోషంగా ఉందని ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.