Sep 20,2022 16:51

ప్రజాశక్తి-యాదమరి : జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతలకు ఎస్ టి యు యాదమరి మండలశాఖ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా స్ధాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న ఎస్ టి యు చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ K.సుబ్రమణ్యం పిల్లె మరియు యాదమరి మండలం గొందివాల్లవూరు ప్రాధమికోన్నత పాఠశాల ప్రదానోపాద్యాయులు జీవనేశ్వర్ నాయుడు లకు అభినందన కార్యక్రమము మరియు సన్మాన కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ సందర్బంగా సుబ్రమణ్యం పిల్లె,జీవనేశ్వరనాయుడులు విద్యాభోధనలో అంకితభావంతో విద్యార్ధులకు గత 24  సంవత్సరాలగా ఉత్తమ భోధనతో విద్యార్ధులను ఉత్తమ పౌరులు గా తీర్చిదిద్దారని సంఘనాయకులు ప్రస్తుతించారు. 
 ఉపాద్యాయులకు సేవలందిస్తూ, పాఠశాల అబివృద్దికి కృషిచేస్తూ దాతల సహకారంతో ఎంవివై కాలనీ పాఠశాలలో డిజిటల్ ప్రొజెక్టరుతో ప్రాథమిక స్థాయి విద్యార్ధులకు డిజిటల్ భోధన అందించారని తెలిపారు. గొంది వాళ్ళ ఊరు వూరు ప్రాథమికోన్నత పాఠశాలలో నాడునేడు కార్యక్రమంలో భాగంగా సుందరంగా తీర్చిదిద్ది జిల్లాస్థాయి స్వచ్చపాఠశాల పురస్కార్ అవార్డు అందుకొన్నారని సంఘ నాయకులు అభినందించారు. 
ఈ కార్యక్రమంలో యస్టియుజిల్లా ఆర్థిక కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి,యాదమరి అద్యక్షులు గుణశేఖరన్,ప్రదాన కార్యదర్శి ఓబుల్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ వాసు  సంఘసీనియర్ నాయకులు బాలచంద్రారెడ్డి మరియు యాదమరి మండల ఉపాద్యాయ సంఘ నాయకులు కనకాచారి ,అమరనాధరెడ్డి, శివప్రసాద్, సురేష్ రెడ్డి, విజయ్ కుమార్,శివశంకర్,మణిరెడ్డి ,భువనేశ్వర్రెడ్డి ,రంగనాదం భాషా ,ఉపాద్యాయులు నీరజ, లోకేశ్వరి, కౌసర్బి, భానుప్రియ, నరసింహా రెడ్డి,మురళీధర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,తారకనాథ్, విజయభాస్కర్,సురేంద్రబాబు, చంద్రమోహన్, జవహర్ తదితరులు పాల్గొన్నారు.