- ఎంపీటీసీ భర్తపై కానిస్టేబుల్ దాడి
ప్రజాశక్తి-పరిగి : పరిగి పోలీస్ స్టేషన్లో సమస్యపై వచ్చిన శ్రీ రంగరాజు పల్లి ఎంపీటీసీ వేదవతి భర్త నరసింహారెడ్డిపై కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి దాడి జరిపారు. అయితే ఇద్దరికీ గతంలో పాత గొడవలు కారణంగానే స్టేషన్ నుండి వస్తున్న వ్యక్తి పై దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిపై స్థానిక వైసిపి నాయకులు సీరియస్గా పరిగణించే కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.










