ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రంలో మరల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కుంబార్లపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో శనివారం నిర్వహించిన గడపగడపకు తెలుగుదేశం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. బాలెంద్ర పల్లి, ముమ్మెడెర్ల పల్లి, కుంబార్ల పల్లిలలో ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను వివరించారు. రాబోవు ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ మరోవైపు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. అదేవిధంగా అధికార వైకాపా చేస్తున్న అక్రమాలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అడుగడుగునా ఆయనకు జననీరాజనాలు అందాయి. ప్రధానంగా యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాలకు హాజరవుతూ ఆయనకు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం. ఈ కార్యక్రమాలలో ఏఎంసీ మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, మండల తెలుగు యువత అధ్యక్షులు ధీరజ్, క్లస్టర్ ఇంచార్జ్ రాంబాబు, నాగరాజు, నాగభూషణం తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










