ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం : మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో వేసిన శ్రీ ద్రౌపతి ధర్మరాజుల సమేత మహాభారతం ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ని చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం అమ్మవారి నైవేద్యం సమయంలో ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో వారికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ పూజారి ఆలయ మర్యాదలతో డిప్యూటీ మేయర్ కి స్వాగతం పలికి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ద్రౌపది అమ్మవారి కల్యాణము ఘనంగా నిర్వహించారు. ఉభయ దారులుగా రిటైడ్ టీచర్ దామోదరం రెడ్డి భానుమతి కుటుంబ సభ్యులు అమ్మవారికి కల్యాణము అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపు చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట దేవరాజు నాయుడు చిత్తూరు ఆరవ డివిజన్ బబులు, భరత్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, సురేష్ రెడ్డి, మణి, కొత్తపల్లి, కొటార్లపల్లి, బసవి రెడ్డిపల్లి, గ్రామ పెద్దలు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.










