May 24,2023 12:14

ప్రజాశక్తి-పోడూరు (పశ్చిమ గోదావరి) : రెండు పూటలా ఉపాధి పని రద్దు చెయ్యాలనీ సిపిఎం పోడూరు మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్ డిమాండ్ చేశారు. పోడూరులో ఉపాధి కూలీల లను కలసివారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మజ్జిగ పొయ్యటందని మెడికల్ కిట్సలేవని ఇంటి పేర్లు లేకుండా పేరు ఒక్కటేవస్తూందని ఒకే పేరున ఇద్దరూ ముగ్గురు ఉంటే పనిచేసిన డబ్బులు ఎవరు ఎక్కౌంటులో పడుతున్నాయో తెలీటం లేదని కూలీలు ఆంళన వ్యక్తం చేశారు.  అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ కూలీలందరికి గునపాలు తట్టలు ఇవ్వాలని అన్నారు.  చట్టప్రకారం సకాలంలో వేతనం కూలీల ఎక్కౌంలో జమచేయాలని కోరారు. మేట్లకు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 200 రోజులు పని కల్పించాలనీ తెలిపారు. రూ 600  వేతనం చెల్లించాలని కోరారు.