ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం రూరల్ (కొత్తూరు) : ఉపాధి పని ప్రదేశాల్లో టెంట్లు మంచినీళ్లు సౌకర్యాలు కల్పించాలని మజ్జిగ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉపాధి పనులు పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు సందర్శించి కూలీలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీలు మండుటెండలో పనిచేస్తున్నామని తెచ్చుకున్న మంచినీళ్లు అయిపోయి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి హామీలు ప్రారంభంలో ఉన్న సౌకర్యాలు అన్ని తీసివేసి కూలీలకు అన్యాయం చేసిందని వాపోయారు. టెంట్లో మెడికల్ గాని మంచినీళ్లు సౌకర్యాలు ఏమీ లేకుండా చేసిందని ఆన్లైన్ మాస్టర్ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇలాగే ఉంటే ఈ పనులు చేయలేమని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మాస్టారు విధానాన్ని రద్దు చేయాలని పనిచేసే చోట్ల కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏవైతే రద్దు చేసిన సమ్మర్ ఎల వెన్స్ ఇవన్నీ కూడా పునరుద్ధరించాలని కూలీలు నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ మండుటెండలో పనిచేస్తున్న కూలీలు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏవైతే రద్దుచేసిన సమ్మర్ అలవెన్స్ మౌలిక సదుపాయాలన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కండెల్లి బాబురావు, అలమండ కోటయ్య, దేవతల భాస్కర్ రావు, మోర్స వెంకట్రావు, లంక రమణ, దేవతల జయలక్ష్మి, మోర్స గంగా, చింతాడ మా లక్ష్మి, అలమండ సూరమ్మ, కండెల్లి ఎస్సిక, తదితరులు పాల్గొన్నారు.










