May 12,2023 15:15

ప్రజాశక్తి-రాయదుర్గం : భారత దేశ కీర్తి ప్రతిష్టలు నిలిపిన రెజ్లర్ లను వేధించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ పై వెంటనే చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు నాయకుల డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు నాయకురాలు పార్వతమ్మ ఏఐవైఎఫ్ రాయదుర్గం తాలూకా కార్యదర్శి కోటేష్ మాట్లాడుతూ భారతదేశనికి స్వర్ణ పతకాలు తెచ్చిన రెజ్లర్ల లను లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్య తీసుకోవాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అతనిపై చర్య తీసుకోకపోవడం విచారకరం అన్నారు. అంతేకాక శాంతియుతంగా నిరసన చేస్తున్న రెజ్లర్లపై  అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే బ్రిజ్ భూషణ్ను పదవి నుంచి తొలగించి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయేషా, సుజాతమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.