ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలో 108 వాహనంలో మగ బిడ్డకు పురుడు పోసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.... ఎస్ఆర్ పురం మండలంలోని ఎగువ కమ్మకండ్రిగ గ్రామపంచాయతీ మిట్ట హరిజనవాడ గ్రామానికి చెందిన రాజేష్ భార్య గౌతమి 28 పురిటి నొప్పులు రావడంతో 108 కి సమాచారాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు . సమాచారం అందుకున్న 108 సిబ్బంది మిట్ట హరిజనవాడ గ్రామానికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో ఫైలెట్ చిట్టిబాబు ఈఎన్ టి సందీప్108 వాహనంలోనే ప్రసవం చేయగా గౌతమి మగ శిశువుకు జన్మనిచ్చింది శిశువు 3.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా జన్మించడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్థానికులు ఆనందం వ్యక్తం చేసి 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు.










