ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురు కుప్పం మండల కేంద్రమైన వెదురు కుప్పం హైస్కూల్ క్రీడా మైదానంలో వెదురుకుప్పం ఎంపీపీ బండి నాగ హేమ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రతాప్ స్వామీజీ నేతృత్వంలో ఈ నెల ఆరవ తేదీ మంగళవారం కార్తీక మాస కృత్తిక నక్షత్రంలో లక్ష దీపోత్సవం కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఏకాంబరం, నియోజకవర్గంలోనే ఆరు మండలాలకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల వైఎస్ఆర్సిపి నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు.










