స్థలాన్ని పరిశీలిస్తున్న తహశీల్దార్
స్థలాన్ని పరిశీలిస్తున్న తహశీల్దార్
దుకాణాల ఏర్పాటుకు స్థల పరిశీలన
ప్రజాశక్తి-సంగం:స్థానిక శివాలయం సెంటర్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు తహశీల్దార్ నాగరాజు స్థల పరిశీలన చేశారు.దుకాణాలు ఏర్పాటు చేసేందుకు స్థలం అణువుగా ఉందో లేదో అని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పని సరిగా లైసెన్స్ పొందాలని సూచించారు. దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్సులు పొంది అధికారులు చెప్పిన నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. లైసెన్సులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విఆర్‌ఒ రవిబాబు పాల్గొన్నారు.










