Jun 11,2023 15:30

ప్రజాశక్తి-కాళ్ల : దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ సేవలు అభినందనీయమని మాజీ ఎంపీపీ  వేగేశ్న వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు పద్మావతి మంచినీటి చెరువులో మూడు రేవులు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఆదివారం పనులకు  శ్రీకారం చుట్టారు.మాజీ ఎంపీపీ  వేగేశ్నవెంకట గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ కాళ్లకూరు గ్రామంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ వెంకట్రామరాజు తాను సంపాదించిన దాంట్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారన్నారు. గ్రామంలోపద్మావతి మంచినీటి చెరువులో దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.5లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ట్రస్ట్‌ వ్యవస్థాపకులు దాట్ల వెంకట్రామరాజు స్వచ్ఛందంగా మంచి అభివృద్ధి పనులు చేయడం ఆనందంగా ఉందన్నారు.  వెంకటేశ్వర స్వామి వారికి, రామాలయంలో పూజలు నిర్వహించే అర్చకులు ఈ రేవుల నుంచి నీటిని నిత్యం తీసుకెళ్తుంటారు. ఈ అభివృద్ధి పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని ట్రస్ట్‌ వ్యవస్థాపకులు దాట్ల వెంకట్రామరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీరమల్లు రామారావు, కట్టా సతీష్, చిటికెన సూర్యనారాయణ, కట్టా బాబ్జి, కోలా ఆంజనేయులు, చిటికెన లక్ష్మణరావు, కట్టా పెద్దిరాజు, గణపతి తదితరులు పాల్గొన్నారు.