దశల వారీగా రీసర్వే కార్యక్రమం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
భూసమస్యలకు శాశ్వతంగా భూసమస్యలు లేకుండా చేసినట్లయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రధానంగా ఏ కార్యక్రమం నిర్వహించిన ఆ కార్యక్రమంలో ఎక్కువ అర్జీలు భూసమస్యలకు సంబంధించి రావడం జరుగుతోందని భావించిన ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని వంద సంవత్సరాలు క్రితం జరిపిన సర్వే కార్యక్రమంలో ఇబ్బందులు వస్తున్నాయని భావించి రీసర్వే నిర్వహించి ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలని భావించడం జరిగింది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర విద్యుత్‌అటవీ పర్యావరణ మరియు మైనింగ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఈ ప్రకారం రీసర్వే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టారు. డ్రోన్ ద్వారా సర్వే నిర్వహించి గ్రామాలకు సంబంధించిన భూముల చిత్రపటాలను ఓఆర్‌ఐ షీట్లు రూపంలో తెప్పించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినందుకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా తగిన సిబ్బందిని నియమించి తిరిగి రైతులు తెలుసుకోవడానికి 100 రోజులు గడువు ఇచ్చి ఈకార్యక్రమం నిర్వహించబడుతోంది. అందుకే ఈ కార్యక్రమానికి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూ అనే పేరును పెట్టడం జరిగింది.
చిత్తూరు జిల్లాలోని 31మండలాలలో 822 గ్రామాలలో ఇప్పటివరకు 716 గ్రామాలలో డ్రోన్ సర్వే పనులు పూర్తి చేయడం జరిగింది. మొత్తం 13.2లక్షల వ్యవసాయ భూములు ఉండగా ఇందులో 10.8లక్షల వ్యవసాయ భూములకు సంబంధించి రీసర్వేలో మొదటిదశ అయిన డ్రోన్ సర్వే పూర్తి అయింది. జిల్లాలో వ్యవసాయ భూములకు సంబంధించిన రీసర్వేలో డ్రోన్ సర్వే మొత్తం 86శాతం పూర్తి అయింది. దీని ద్వారా 4370 చదరపు కిలోమీటర్లు డ్రోన్ సర్వే చేయడం జరిగింది. ఈ డ్రోన్‌సర్వే కార్యక్రమాన్ని మొత్తం మూడు సంస్థలు నిర్వహించాయి. సర్వే ఆఫ్ ఇండియా, క్లియర్ వాటర్ డైనమిక్స్, ఆస్టీరీయా కంపెనీలు గ్రామాలలో డ్రోన్ సర్వే నిర్వహించాయి. డ్రోన్ సర్వేకు ముందు నిర్ణయించిన గ్రామాలలో గ్రామ సరిహద్దులను గుర్తించి ఆ పాయింట్ వద్ద సున్నం మార్కింగ్ వేయడం జరుగుతుంది. ఆమార్కింగ్ ప్రకారం నిర్ణయించిన హద్దులలో డ్రోన్ సర్వే పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సర్వే నిర్వహించిన సంస్థలు, ప్రభుత్వానికి ఓఆర్‌ఐ షీట్లు పంపడం జరుగుతుంది. ఈలోగా గ్రామకంటాలు, ప్రభుత్వ భూములను గుర్తించడం జరుగుతుంది. ఓఆర్‌ఐ షీట్లు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి గ్రామంలో ఉన్న గుర్తింపు చిహ్నాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడం చేస్తారు. ఆ తర్వాత ప్రతి 250 ఎకరాలకు ఒకసర్వే బందం క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ట్రూథింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నుంచి పూర్తిగా ఫైనల్ ఆర్‌ఓఆర్ వరకు 100 రోజులు సమయం పడుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి పూర్తి అయ్యేలోపున ఏ రోజుకు ఆ రోజు గ్రౌండ్ ట్రూతింగ్ చేసే వివరాలను ల్యాండ్ నేచర్‌లను పరిశీలిస్తూ ప్రిలిమనరీ రికార్డ్స్ తయారు చేస్తారు. గ్రౌండ్ వాలిడేషన్ పూర్తిచేసిన తర్వాత 9,(2) నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అప్పటికే రైతులకు సంబంధించిన భూముల వివరాలను ఈ నోటీసులలో తెలపడం జరుగుతుంది కాబట్టి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత రైతులు 21 రోజుల లోపల ఏవైనా ఆక్షేపాలు ఉన్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చు.
భూ వివాదాలు తగ్గుతాయి
- ఎం. హరినారాయణన్, కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా భూవివాదాలకు చెక్ పెట్టాలని రీసర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని మొత్తం 822 గ్రామాలు ఉండగా ఇప్పటివరకు 716 గ్రామాలలో డ్రోన్ సర్వే నిర్వహించడంతో 86 శాతం పూర్తి అయింది. 124 గ్రామాలలో రీసర్వే పనులు పూర్తికాగా క్లరికల్ వెరిఫికేషన్ చివరి స్థాయిలో ఉంది. ఈ గ్రామాలలో భూహక్కు పత్రాలు రాగానే పంపిణీకి రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో భూసమస్యలు పరిష్కారంతోపాటు భూహక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు అపరిష్కతంగా ఉన్న రెండు రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేయడం, మ్యుటేషన్‌లను చేయడం ద్వారా రైతులకు భూసమస్యలు లేకుండా ఉంటాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా రానున్నరోజుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి.
శరవేగంగా రీసర్వే పూర్తి చేస్తాం..
- వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో రీసర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరంతరం రీసర్వే కార్యక్రమంపై రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కలెక్టర్‌తో కలిసి పర్యటనలు చేస్తూ రీసర్వే కార్యక్రమంలో డ్రోన్‌సర్వే వేగవంతంగా నిర్వహిస్తున్నారు. 204 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ సీట్లు రాగా 124 గ్రామాలకు సంబంధించి ఫైనల్ ఆర్‌ఓఆర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 110గ్రామాలకు సంబంధించి క్లరికల్ వెరిఫికేషన్ పూర్తి అయింది. మిగతా గ్రామాలలో మరో రెండు రోజులలో పూర్తి కానుంది. భూహక్కు పత్రాలు వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడానికి అన్ని చర్యలు కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తాం.
రెవెన్యూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేందుకు రీసర్వే
- వి.సురేష్ బాబు, తహశీల్దార్,
కుప్పం మండలం
గతంలో వంద సంవత్సరాల క్రితంసర్వే కార్యక్రమం నిర్వహించబడింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ముందుకు వచ్చి రెవెన్యూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేందుకు రీసర్వే కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందించదగ్గ విషయం. క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించిన డాక్యుమెంట్లు సిబ్బందికి చూపాల్సి ఉంటుంది. ఇంకా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఈ కార్యక్రమానికి వారే ముందుకు వచ్చేలా చేస్తే మరింత బాగుంటుంది. ఇప్పటికే చాలా వరకు రైతులు రీసర్వే కార్యక్రమానికి సహకరించి తమకున్న సమస్యలను పరిష్కరించుకొని మ్యుటేషన్ లాంటి సమస్యలు పరిష్కారమవుతాయి.
రీసర్వే ద్వారా భూహక్కును పొందే అవకాశం
- మహాలక్ష్మి,గ్రామ సర్వేయర్,
గుట్టపల్లి, కుప్పం మండలం
నేను దాసేగౌనూరు గ్రామసర్వేయర్‌గా పనిచేస్తున్నాను. రీసర్వేలో భాగంగా నాకు గుట్టపల్లి, బోగ్గుపల్లిలో సర్వేపనులు అప్పగించారు. తమ బందాలతో పాటు పనిచేశాను. గ్రామస్తుల సహకారంతో దిగ్విజయంగా అన్నికార్యక్రమాలు పూర్తయ్యాయి. కొత్తగా ఉద్యోగం లోజాయిన్ అయిన నాకు సర్వే పనుల మీద మంచి అవగాహన రావడం జరిగింది.










