Sep 03,2022 23:00

మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

డ్రిప్‌, స్ప్రింక్లర్లను సద్వినియోగం చేసుకోవాలి : డిప్యూటీ సిఎం
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌

రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు అవసరమైన అన్ని సేవలు అందిం చేందుకు ప్రభుత్వం కషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, ఎక్సైజ్‌ శాఖమాత్యులు కె.నారాయణ స్వామి పేర్కొన్నారు.
శనివారం గంగాధర్‌ నెల్లూరు మండలం (జీడి నెల్లూరు) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉద్యాన శాఖ ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా డ్రిప్‌ పరికరాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన వాహనాలను ఉప ముఖ్య మంత్రి, కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ లతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్య క్రమాలను అమలు చేస్తోందన్నారు. డ్రిప్‌ పరికరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 94 మం ది రైతులకు బిందు, తుంపర్ల సేద్యమునకు సం బంధించిన పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు .రైతులకు వారి ఇంటి ముంగిటకే సేవలందించేందుకు రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిందని ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వి నియోగం చేసుకొని లాభసాటి వ్యవసాయం చేయాలన్నారు. పంటకు నీరు ఎక్కు వైన దిగుబడి రాదని తగినంత నీరు అందించేందుకు డ్రిప్‌ పరికరాలు ఉపయో గ పడుతుందని ,ఈ పరికరాలను రైతులు సద్వినియోగం చేసు కోవాలని తెలిపారు. సన్న,చిన్న కారు రైతులకు గతం లో ఉన్న సీలింగ్‌ రూ.2 లక్షల నుంచి రూ. 2.18 లక్షలకు, ఐదు ఎకరాల పైన 10 ఎకరాల లోపల ఉన్న రైతులకు గతం లో ఉన్న సీలింగ్‌ 2. 8 లక్షల నుంచి 3.46 లక్షలకు పెంచడం జరిగిందనన్నారు... ఈ పరికరాలను సరఫరా చేసేందుకు జిల్లా కు 24 మైక్రో ఇరిగేష న్‌ కంపెనీల ను కేటాయించడం జరిగిందని, రైతులు కోరుకున్న కంపెనీ పరికరాల తీసుకోవ చ్చునని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు లక్ష హెక్టార్లకు పైగాఉద్యా నవన పంటలు సాగ వుతున్నాయని, ఎక్కు వగా మామిడి పంట కలదని, తక్కువ నీటితో పంటసాగు చేసేం దుకు డ్రిప్‌ ఉపయో గపడుతున్నారు. ఇజ్రాయిల్‌ దేశంలో డ్రిప్‌ నీటి యాజమా న్య పద్ధతులను ఉప యోగించి వారు పం డించే పంటలను యూరప్‌ మొత్తం ఎగుమతి చేయడం జరుగుతోందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు అవసరమైన డ్రిప్‌ పరిక రాలను ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తుందని, ఈ పరికరాలను రైతులు సద్వినియో గం చేసుకొని అధిక దిగుబడి సాధించా లని తెలిపారు. జిల్లా లో 9800 హెక్టార్లలో బిందు తుంపర్ల సేద్య పరి కరాల ఏర్పాటు కు చర్యలు చేపట్టడం జరిగిందనన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పరికరాలు మంజూరైన రైతులకు ప్రొసీడింగ్స్‌ ను ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలె క్టర్‌ చేతులమీ దు గా అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్‌ డి ఓ రేణుక, జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి మధుసూదన్‌ రెడ్డి, ఎంపీపి అనిత, జెడ్పిటిసి లక్ష్మీప్రియ, తహ సీల్దార్‌ ఇన్బునాధన్‌, ఎంపీడీఓ శ్రీదేవి పాల్గొన్నారు.