ప్రజాశక్తి - పాలకోడేరు
కుమదవల్లి గ్రామంలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పాఠశాల విద్యార్థులకు లైంగిక వేధింపులు, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి భూపతి రాజు వంశీకృష్ణంరాజు అధ్యక్షత వహించారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువత వ్యసనాలకు బానిసలవుతున్నారన్నారు చదువుకునే వయసులో చదువుకోవాలని ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డ్రగ్స్ తీసుకున్న అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రిన్సిపల్ రామకృష్ణ, పిఒ సురేష్, శంకర్, మహిళా పోలీస్ బేబీ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










