అనంతపురం క్రైం : డ్రగ్స్ రహిత సమాజం కోసం సమిష్టిగా అందరూ కృషి చేద్దామని ఎస్పీ కె.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ప్రయివేటు, ప్రభుత్వ కళాశాలల కరస్పాండెంట్‌లు, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలపై కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్ అనర్థాలను సూచిస్తూ కళాశాలల వద్ద హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా టోల్ ఫ్రీ నెంబర్ 14500కు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామన్నారు. సమచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అర్.విజయభాస్కర్ రెడ్డి, అనంతపురం డీఎస్సీ ప్రసాదరెడ్డితో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్ లు పాల్గొన్నారు.










