ప్రజాశక్తి -వెంకటాచలం :ప్రఖ్యాతిగాంచిన కసుమూరు దర్గాలో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.మండలంలోని కసుమూరు గ్రామంలో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. రూ. 1.63 కోట్ల విలువైన సిసి రోడ్లు, డ్రెయిన్లు, కసుమూరు దర్గా తిప్ప పైన మస్తాన్ వలి భక్తుల వసతి సముదాయానికి ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి కాకాణి మీడి యాతో మాట్లాడారు. గతంలో కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేసి పనులు పూర్తి చేయడం విస్మరించారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.ఒక్క కసు మూరులోనే ఇప్పటివరకు రూ 8.80 కోట్ల మేర అభివద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఎంపిడిఒ వెంకట రమేష్, ఎంపిపి మంద కవిత, సర్పంచ్ కడివేడి శివ, సచివాలయ కన్వీనర్ మనోజ్, స్థానిక నాయకులు జిల్లా వైఎస్‌ఆర్సిపి ఉపాధ్య క్షుడు మందల వెంకట శేషయ్య, ఉప ఎంపీపీ కోదండరామిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు హుస్సేన్ ఉన్నారు.










