Aug 08,2022 23:01

డ్రాయింగ్‌లో పిఈఎస్‌ విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
యాదమరి మండల పరిధిలోని పిఇఎస్‌ పబ్లిక్‌ పాఠశాల విద్యార్థులు మరోసారి డ్రాయింగ్‌లో వారి సత్తాను చాటుకున్నారు. ఆస్ట్రోనమర్స్‌ స్టూడెంట్‌ స్పేస్‌ రిసెర్స్‌ ఆర్గనైజేషన్‌ వేలూరు వారి ఆధ్వర్యంలో చిత్తూరులో డ్రాయింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహించడం జరిగింది. ఇందులో చిత్తూరు పరిసర ప్రాంతాలో ఉన్న అనేక పాఠశాల విద్యార్థులు కేటగిరి-3తో మనుశ్రీ మొదటి బహుమతి, కేటగిరి-2లో నోషిత చౌదరి మొదటి బహుమతి, కె సాహితి మూడో బహుమతి కేటగిరి 4లో హర్షిత , రెండో బహుమతి, గర్షన్‌ మూడో బహుమతి కైవశం చేసుకునానరు. గెలుపొందిన విద్యార్థులకుడిఇఒ పురుషోత్తం చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పిఇఎస్‌ పబ్లిక్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ కృష్ణబాబు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆర్ట్‌ మాస్టర్‌ రాజ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు.