డపింగ్ యార్డు కష్టాలు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
నగరంలోని మంగసముద్రం, లెనిన్‌నగర్ వాసులను డపింగ్‌యార్డ్ కష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడీ ఆవాసాల మధ్య ఉన్న డపింగ్ యార్డును మార్చాలాంటూ సుదీర్ఘ పోరాటం చేస్తున్నా నగర పాలక సంస్థ చెవిన పడ్డంలేదు. ఓదశలో కౌన్సిల్ ఆమోదంతో మూడోగేటు బండపల్లి వద్దరు కమ్యూనిటి డపింగ్‌యార్డును మార్చేందకు నగరపాలక సంస్థ ప్రయత్నాన్ని బండపల్లివాసులు అడ్డకోవడంతో డపింగ్‌యార్డు సమస్య తిరిగి మొదటికి వచ్చింది. లెనిన్‌నగర్, మంగసముద్రం ప్రాంతంలో దినసరి కూలీలు, పేదలు పెద్దసంఖ్యలో ఆవాసాలు అధికంగా ఉన్నాయి. ఆవాసాల మధ్య నగరంలోని చెత్తను వాహనాల్లో తీసుకుపోయి డపింగ్ చేయడంతో ఇక్కడి ప్రజలు కంపు భరించలేక అల్లాడుతున్నారు. వర్షాకాలంలో మరీ ఎక్కువగా రెండు కిలోమీటర్ల వరకు డపింగ్‌యార్డు పొగ, కంపుతో ఇబ్బందిపడాల్సి వస్తోంది. అనేకసార్లు ఈ సమస్యపై నగర పాలక సంస్థ అధికారులు దృష్టికి తీసుకుపోవడంతో నిరసన తెలిపారు. ప్రజాప్రతినిధులు, నగర పాలకసంస్థ అధికారుల హామీలతో నిరసనలు విరమించిన సందర్భాలున్నాయి. నగర విస్తరణ తరువాత నగర శివార ప్రాంతాల్లో వేయాల్సిన చెత్త ఇళ్ల మధ్యలో నిల్వ ఉంచడం వల్ల పందుల సంచారమూ పెరుగుతోందని, దీనికి తోడు అంటువ్యాధులు ప్రభలతున్నట్లు ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు డపింగ్‌యార్డు మార్పులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.










