ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని పలు గ్రామాల నందు రైతులు సాగుచేసిన వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పంటలకు అకాల వర్షాలు బారినష్టాన్ని మూల్యం చెల్లించాలని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 3.7 సెంటీమీటర్లు వర్షం నమోదు అయినట్లు వాతావరణ శాఖ సిబ్బంది తెలియజేశారు. రైతులు వరి కోత మిషన్లతో వరి పంటను కుప్పచేసి ఆరబెట్టుకున్న సమయంలో అకాల వర్షాలు రావడం రైతుకు కష్టాలు మిగిలిచాయని పండించిన పంట తడిసి ముద్దయి మొలకలు వచ్చాయని స్థానిక రైతులు ఉన్నారు. గత వారం రోజు నుంచి వరి ధాన్యాన్ని ఆరబెట్టుకున్న సంచులు కొరత ఉన్నందున వ్యాపారులు ముందుకు రాకపోవడం ప్రభుత్వం సహకరించకపోవడం పూర్తి నష్టపోయామని మొలకెత్తిన పంటను ప్రభుత్వము నేడు ఉన్న ధరకే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్తి పంటకు నీరు నిలవండి ఏరు కూలిపోతుందని 40 నుండి 50 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు అకాల వర్షాలు ఒకవైపు రసాయన ఎరువులు అందుబాటు లేక క్రిమిసారార్ మందులు సైతం బళ్లారికి వెళ్లి తీసుకొస్తున్నామని ఆర్బికెల్లో ఎరువులు నీళ్లు మందులు కొరత తీవ్రంగా ఉందని రైతులు అన్నారు. కొన్ని ఆర్పీకెల్లో సిబ్బంది లేకపోవడంతో రైతులు ఎవరికి మొర పెట్టాలి మరియు భూసార పరిరక్షణ ఎలా నిర్వహించాలి. మదన పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. కొల్లగానహళ్లి బండూరు బల్లనగుడ్డం కురవల్లి సచివాలయంలో సిబ్బంది కొరత వల్ల రైతులు బళ్లారి లోని రసాయన ఎరువులు క్రిమిసం మందులు దుకాణదారులు సలహాలు మేరకే పంట సాగు చేస్తున్నామన్నారు. దర్గా ఉన్నూర్ రసాయన దుకాణంలో నుండి ఎరువులు కొనుగోలు చేసిన అవి వారమైన కడగలేదని వారిపై వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేసిన ఫలితం లేదంటున్నారు.










