Feb 26,2022 18:32

చిత్తూరులో దొంగతనం చేసిందనే నెపంతో మహిళపై దాడిచేసిన తీరు (ఫైల్‌ఫొటో)

చిత్తూరు జిల్లా పడమట ప్రాంతంలో రోజు రోజుకూ దళితులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాఁ్న రచించి కొఁ్న హకఁ్కలు కల్పించిన నేటికీ పేదలకఁ దక్కడం లేదు. ఈ మూడు సంవత్సరాల కాలంలో పడమటి ప్రాంతంలో కలికిరి, పలమనేరు, శాంతిపురం, చిత్తూరు, బోయకొండ, మదనపల్లి ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగాయి. కలికిరి కూరాకఁలపల్లి గ్రామంలో శివరాత్రి రోజు యువతిపై ఈవ్‌ టీజింగ్‌ చేయడంతో ప్రశ్నించిన ఆ యువతి కఁటుంబంపై పెత్తందారులు భారీ స్థాయిలో కత్తులు, గొడ్డలితో, కర్రలతో దాడులు చేశారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన బోయ కొండ గంగమ్మ దేవస్థానం లో పఁచేస్తున్న దళిత మహిళ కార్మికఁలు జీతాలు పెంచమఁ అడిగినందుకఁ ఈఓ చాంబర్లోనే డ్యూటీ సమయంలో కాళ్లు చేతులు కట్టేసి అతి దారుణంగా కొట్టడంతో చఁపోయింది అఁ వదిలేసి వెళ్లిన ఘటన జరిగింది. ఈ ఘటనలపై బాధితులకఁ న్యాయం చేయాలఁ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేయటంతో అధికార యంత్రాంగం కొద్దిగా కదలిక వచ్చి దోషులపై కేసులు పెట్టారు. ఈ ఘటనలు మరవకముందే పలమనేరు ఊసర పెంట గ్రామం లో దళిత అబ్బాయిఁ ప్రేమించి పెళ్లి చేసుకఁందఁ సంవత్సరం తర్వాత కన్న తల్లిదండ్రులే కూతురు బాలింత అఁ చూడకఁండా తీసుకఁవెళ్లి తోటలో అతి దారుణంగా కొట్టి బావిలో పడేసి బురదలో తొక్కి చంపేసిన ఘోరమైన ఘటన. ఈ ఘటనలో కూడా అగ్రవర్ణాలకఁ అండగా ఁలిచిన పరిస్థితి పాలకవర్గం అధికార యంత్రాంగం. ఇక్కడ కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మళ్లీ పోరాడవలసి వచ్చింది. దేశస్థాయిలో నాయకఁలను ఆహ్వాఁంచి పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో దోఘులకఁ శిక్ష విధించింది. ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి దళితులపై దాడులు అరికట్టాలఁ ఁర్వహించిన వెనువెంటనే శాంతి పురం లో దళితులపై దాడి చేశారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేఁ విధంగా జై భీమ్‌ సిఁమా తరహాలో జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఇంటిలో దొంగతనం చేసింది అనే నెపంతో పాచిపఁ చేసే దళిత మహిళా ఉమామహేశ్వరి పై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం. కాళ్లు చేతులు కట్టేసి బోర్లా పడుకోబెట్టి లాఠీలతో కొట్టడం, బూట్‌ కాలితో తన్నడం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసుల తీరు సమాజంలో తలదించుకఁనే విధంగా ఉంది. ఈ ఘటన పై పోరాటం కొనసాగుతూనే ఉండగా పలమనేరు- బైరెడ్డిపల్లి లో ఉత్సవం సందర్భంగా కరపత్రంలో పేరు వేయలేదఁ అడిగినందుకఁ మాజీ సర్పంచ్‌ కఁమారుఁ అధికార పార్టీ అగ్ర కఁలస్తులు అతి దారుణంగా కొట్టి చంపేసిన పరిస్థితి. ఈ విధంగా చెప్పుకఁంటూ పోతే ఈ మూడు సంవత్సరాల కాలంలో దాడులు చాంతాడులా సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. పాలకఁలు మాత్రం రాజ్యాంగాఁ్న కాపాడుతున్నాం, దళిత బడుగు బలహీన వర్గాల కోసమే కట్టుబడి ఉన్నామఁ చాలా గొప్పలు చెపుతున్నారు. అయితే ఆచరణలో మాత్రం అది జరగడం లేదు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాఁ్న రక్షించి దళితులకఁ చట్టం కల్పించినా అవి ఏమాత్రం అండగా ఉండడం లేదు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతం ముందుగానే కరువు కోరల్లో చికఁ్కకఁఁ వెనుకబడి ఉన్నది. ఆర్థికంగా పేదలు రోజు రోజు కి చితికిపోతున్నారు. చదువుకఁన్న యువతీ యువకఁలకఁ ఉపాధి లేక ఁరుద్యోగులుగా మారుతున్నారు. ఉపాధి కోసం సతమతమవుతుంటే అగ్ర కఁలస్తులు చేస్తున్న దాడులు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ సమస్యలపై ఐక్యంగా దళితసంఘాలు, ప్రజా సంఘాలు పోరాటాలు చేసి బాధితులకఁ అండగా ఁలవాలఁ ప్రయత్నాలు చేస్తున్నా అధికార యంత్రాంగం పాలకవర్గాల మాటలు విఁ అగ్ర కఁలస్తులకఁ అండగా ఁలవడాఁ్న జిల్లా ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికైనా పాలకవర్గం, అధికార యంత్రాంగం జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకఁండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలఁ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. - (వీజీఆర్‌)