ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ టిడిపి హయాంలో నిరుపేద దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆత్మకూరు మండలం, బి యాలేరులో దళితుల ఇళ్ల పట్టాలు రద్దు చేయడాన్ని నిరసిస్తూ టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్.రాజు నేతృత్వంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందసర్భంగా ఆమె మాట్లాడుతూ బి.యాలేరు దళితులకు టిడిపి ప్రభుత్వంలో భూములు కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చిందని ఉన్న వారికి ఇళ్ల పట్టాలు రద్ధు చేయడం ఏమిటన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే తాము స్వాగతిస్తామన్నారు. ఉన్న పట్టాలు రద్దు చేసి వైసిపి నాయకులకు కావాల్సిన వారి కోసం ఇస్తామంటే సహించేది లేదన్నారు. పేదలను ఆదుకోవాలంటే వేరొకచోట భూములు కొని ఇవ్వాలన్నారు. అలా కాదని దళితుల్లో చీలిక తెచ్చి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఆ స్థలంపై జేసి కోర్టులో ఉన్నప్పటికీ మరొకరికి పట్టాలు ప్రయత్నం చేయడం సరికాదన్నారు. టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్.రాజు మాట్లాడుతూ దళితులంటే ప్రభుత్వానికి ఎందుకంత చులన అన్నారు. ఉన్న ఇళ్ల పట్టాలను రద్ధు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారని, అయితే అధికారులు మాత్రం చట్టం అనుసరించి పేదలకు న్యాయం చేసే బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా దళితులకు ఇలాంటి చర్యలతో అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క దళితుని ఇళ్ల పట
నిరసన వ్యక్త చేస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్.రాజు, బాధితులు










