Sep 12,2022 23:24

దళారుల నుంచి కాపాడు దేవా..!
విఐపి దర్శనాల పేరుతో దందా
గణనాధుని ఆలయం ఆదాయానికి గండి
పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలంటున్న భక్తులు
ప్రజాశక్తి- ఐరాల:

కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో ప్రధానంగా పడమర ద్వారంలో విధినిర్వహణలో ఉన్న కొందరు హోంగార్డులు వద్ద గేటు తాళాలు ఉంటాయి. దీంతో దళారులు అవతారమెత్తి భక్తులు నుంచి డబ్భులు తీసుకొని స్వామివారి ఆంత్రాలయ దర్శనాలు చేస్తున్నారు. దీని వలన గణనాధుని ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతోదందని పలువురు స్థానికులు, సామాన్య భక్తులు ఆరోపిస్తున్నారు.
స్వామివారి సందర్శనార్థం స్థానిక స్థానికులతోపాటు మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణా, వంటి పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అయితే ఏడాదిలో ప్రత్యేకరోజులైనా నూతన సంవత్సరం, మహాశివరాత్రి, తెలుగు ఉగాది, నూతన సంవత్సరం, వినాయకచవితి వంటి పర్వదినాల్లోనే కాకుండా ప్రభుత్వ సెలవరోజులైన శనివారం, ఆదివారం రెండు రోజులు కూడా స్వామివారి సందర్శనార్థం భక్తులు తరలి వచ్చి ఆలయ అధికార్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లో బారులు తీరడంతోపాటు అణివేటీ మండపం, శుభధ మండపం, కళ్యాణ వేదిక మండపం, అర్ధ మండపం, మూషిక మండపం వంటి ప్రాంతాలలో భక్తులు కిటకిటలాడుతుంటారు.
దీంతో ఆలయ అధికార్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉచిత దర్శనం, రూ.100ల శీఘ్రదర్శనం, రూ.150ల అతి శీఘ్ర దర్శనం వంటి క్కులైన్లతోపాటు విఐపి క్కులైన్‌ సైతం ఏర్పాటు చేశారు. భక్తులు రద్దీ క్రమపద్ధకరించందుకు ఉత్తర మహాద్వారం వద్ద, దక్షణ మహాద్వారం వద్ద, వెలుపలికి వెళ్లే పడమర ద్వారం వద్ద కొందరి హోంగార్డులను రోజువారివీధులలో నియమిస్తారు. అందులో విదినిర్వహణలో ఉన్న హోంగార్డు వద్ద గేటు తాళాలు ఉంటాయి. ఇదే అదునుగా తీసుకున్న హోంగార్డులు ఇష్టానుసారంగా రహస్య బహిరంగంగానే డబ్బులు ఇచ్చిన భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అందులో భాగంగా 2022 సెప్టెంబర్‌ 10,11, తేదీలలో అంటే శనివారం, ఆదివారం రెండు రోజులపాటు సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రావడం గమనార్హం. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ, ఎంవి.సురేష్‌ బాబు, ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్‌ ఎ.మోహన్‌రెడ్డిలు ఉదయం నుంచి సాయంత్రం పర్యవేక్షించి ముందు జాగ్రత్తచర్యగా తనవంతు సేవలందించి దర్శనభాగ్యం కల్పించారు. కానీ హోంగార్డులు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా 20 మంది చొప్పున మూడు బ్యాచ్‌ లుగా 60మంది భక్తుల వద్ద డబ్బులు తీసుకుని విఐపి పేర్లతో స్వామివారి దర్శనం చేసినట్లు స్థానికులు, భక్తులు ద్వారా తెలిసింది.
విధినిర్వహణలో ఉన్న హోంగార్డును ఇదేమి న్యాయమని ప్రశ్నిస్తే ఆలయ ఈఓ అనుమతి మేరకు మూడు బ్యాచ్‌లుగా వెలుపలకి వెళ్ళే గేటు తీసి స్వామివారి దర్శనానికి పంపడం జరిగిందని స్థానికులైనా, సామాన్య భక్తులైనా సరే పడమరదారిలో దర్శనానికి వెళ్ళడానికి వదిలే ప్రసక్తి లేదని తాళాలు ఆలయ ఈఓ చేతులో ఉందని సమాధానం చెప్పినట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోని హోంగార్డులు కొందరు అధికారుల అండదండలతో దళారులుగా మారి విధినిర్వహణలో ఉన్నపుడు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులతో గతంలో ఉన్న పాతపరిచయాల ద్వారా డబ్బులు వసూళ్లు చేసుకొని విఐపిలు, ఆలయ అధికార్లు బంధువులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నత అధికార్లు పేర్లు చెప్పి స్వామివారి దర్శనం భాగ్యం కల్పించి జేబులు నింపుకోవడం మామూలైంది. దీనివల్ల వరసిద్ధి వినాయక స్వామివారి సందర్శనార్థం తరలివచ్చే భక్తులకు దళారుల దర్శనాలతో సకాలంలో స్వామివారి దర్శనం కల్పించకపోవడమే కాకుండా దర్శనానికి అంతరాయం కలుగుతుందని భక్తులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్లు కాణిపాకం దేవస్థానంలో విఐపిల పేర్లతో డబ్బులు తీసుకొని స్వామివారి దర్శనాలు చూపించే దళారులపై నిఘాపెట్టి దళారులకు కళ్లెంవేసి ఆలయ ఆదాయానికి గండిపడకుండా చూడాలని స్థానికులు, భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.