డ్రైవర్‌తోపాటు ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
ప్రజాశక్తి - భీమవరం రూరల్
మోటార్ సైకిల్‌ను తప్పించబోయి విద్యార్థుల ఆటో డివైడర్‌ను ఢకొీంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులతో పాటు, ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలయ్యారు. ఈ సంఘటన సోమవారం భీమవరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఆనందరావు గొల్లలకోడేరు, తుమ్మలగుంటపాలెం, మహదేవపట్నం గ్రామాల్లోని విద్యార్థులను రోజూ భీమవరంలోని సెంట్‌మెరీస్ హైస్కూల్ తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 15 మంది విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని భీమవరం తీసుకొస్తున్న సమయంలో బివి రాజు కళాశాల రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మోటార్ సైకిల్‌ను తప్పించబోయి ఆటో డివైడర్‌ను కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటీన గాయపడిన వారిని ప్రయివేటు వాహనంలో అక్షర హాస్పిటల్‌కు తరలించారు. వీరంతా గొల్లలకోడేరు, మహదేవపట్నం, పాలకోడేరు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వారిలో మహదేవపట్నానికి చెందిన పొలమూరి ప్రవీణ్ సంతోష్ (8వ తరగతి) ఎడమ చేయి విరిగింది. గొల్లలకోడేరుకు చెందిన సోడదాసి స్వర్ణ విశాల్ (5వ తరగతి) కుడికాలు రెండు చోట్ల విరిగింది. వారికి సర్జరీ చేస్తున్నారు. అలాగే తుమ్మలగుంటపాలెంకి చెందిన కుక్కల తేజ అశ్విన్ (4వ తరగతి) కాలుకు గాయం కాగా సిమెంట్ కట్టే వేశారు. కుక్కల భార్గవి (8 తరగతి) తలకు గాయమైంది. అలాగే ఆటో డ్రైవర్ కుమార్తె గరికముక్కల సంజన (6 తరగతి) చేతికి గాయమైంది. మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడి విద్యార్థులను మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి శివరామరాజు, డిఎస్‌పి శ్రీనాథ్, పోలీసు సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులను పరామర్శించారు.










